• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

VSP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. 85 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్రాల వద్ద బందోబస్తు, 144 సెక్షన్ అమలు, వైద్య శిబిరాలు, తాగునీరు, అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

కృష్ణా: పార్లమెంట్‌లో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం పాల్గొనారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్కువైజేషన్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి విధి నిర్వహణ కమిటీపై కమిటీ సభ్యులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: గణేష్ రెడ్డి

ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

కళాశాలకు చేరిన ఇంటర్ హాల్ టికెట్స్..!

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్‌లోకి చేరాయని నడిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు ముగియడంతో, విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

MNCL: మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డులోని అన్ని వీధుల్లో కల్వర్టులను త్వరగా నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత

కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

February 20, 2026 / 02:01 PM IST

ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సందర్శించిన వైద్యులు

BDK: మణుగూరు మండలం అశోక్ నగర్‌లో చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు పుల్లారెడ్డి సందర్శించారు. మన ఇంటి పరిసరాల్లో దోమలు పుట్టకుండా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుల్లారెడ్డి, సునీల్ తెలిపారు. అనంతరం హాస్టల్ లోని కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:01 PM IST

‘హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం’

E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

నేత్రదానంతో ఇద్దరి జీవితంలో వెలుగులు

MNCL: బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తిలో శుక్రవారం మరణించిన చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్ కళ్ళను జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ హైదరాబాద్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

February 20, 2026 / 02:01 PM IST

BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అజయ్

SRCL: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్య దర్శిగా కొప్పుల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల అజయ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల స్థానిక బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుడదు: ఎమ్మెల్యే

RR: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. SDNR మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. వార్డుల వారిగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు.

February 20, 2026 / 02:00 PM IST

అదుపుతప్పి వాహనం బోల్తా..

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా పడింది. మార్గం మధ్యలో వాహనం అదుపుతప్పడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సీడ్ యాజమాన్యం బోల్తా పడ్డ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసింది

February 20, 2026 / 01:56 PM IST

మెగాస్టార్‌తో నాగ్ అశ్విన్ మూవీ..?

‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

February 20, 2026 / 01:56 PM IST

ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి: రేవంత్

TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయి. ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన AI ఫలితాలు మనం చూస్తున్నాం’ అని అన్నారు.

February 20, 2026 / 01:55 PM IST

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్

కృష్ణా: గుడివాడ లోని కార్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి సరిదిద్దాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 01:51 PM IST