• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యాలయాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష

SRCL: జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.

February 20, 2026 / 05:20 PM IST

భారతి సిమెంట్ ఎదుట బాధితుల ధర్నా

AP: కడప జిల్లా కమలాపురం పరిధిలో భారతి సిమెంట్ ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. ఇచ్చిన హామీలను భారతి సిమెంట్ యాజమాన్యం అమలు చేయలేదని.. పెద్ద ఎత్తున బాధితులు ధర్నా చేస్తున్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారంటూ ఆందోళన చేపట్టారు. శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. కొందరికే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.

February 20, 2026 / 05:19 PM IST

‘బాల్య వివాహం అనేక సమస్యల వలయం’

KKD: పిఠాపురం ICDS సీడీపీవో దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల క్యాంపెయిన్ భాగంగా రాపర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత స్కూల్లో జరిగింది. చిన్న తనంలో బాల్యవివాహాల వలన శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందరని అనేక సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. అమ్మాయికి 18 అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు.

February 20, 2026 / 05:17 PM IST

వార్డ్ మెంబర్లకు ముగిసిన మొదటి విడత శిక్షణ

NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 20, 2026 / 05:16 PM IST

అభిషేక్, ఇషాన్ కంటే అతడే డేంజర్: గవాస్కర్

స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్‌లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:15 PM IST

తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమ‌లు: గొంగిడి సునీత

BHNG: భారతదేశం అంత‌టా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంద‌ని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్ర‌వారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యంతో అనేక మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుంద‌న్నారు.

February 20, 2026 / 05:14 PM IST

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం

‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్‌షీట్‌లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

February 20, 2026 / 05:12 PM IST

దేవరకద్రలో బాధ్యతలు స్వీకరించిన నూతన పాలక వర్గం

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:11 PM IST

పునరుద్ధరణ పనులు పరిశీలించిన కలెక్టర్

KNR: జిల్లా కేంద్రంలోని పురాతన పాఠశాల పరిధిలోగల జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న గదులను తనిఖీ చేశారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ క్రాఫ్ట్ ప్రదర్శన గురించి పలు సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 05:09 PM IST

‘శ్రీవారి ఫొటోలు, ఫ్లకార్డులు వాడటం దుర్మార్గం’

AP: వైసీపీ నేతలు దేవుడి పట్ల భక్తి, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలకు జగన్, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ఫ్లకార్డులను వాడటం దుర్మార్గమన్నారు. స్వామివారి ఫొటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారని.. నిరసన అవగానే ఇంకొకరు టేబుల్‌పై పడేశారని చెప్పారు.

February 20, 2026 / 05:09 PM IST

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

WGL: సంగెం మండలంలోని గవిచర్ల శ్రీ గుండ బ్రహ్మయ్య స్వామి దేవాలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహించారు. నేడు మహోత్సవాలకు కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవిచర్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు.

February 20, 2026 / 05:08 PM IST

రైతులకు నేరుగా యూరియా ఇవ్వాలి: సీపీఎం

SRPT: సహకార సంఘాల ద్వారానే రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాప్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్రం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.

February 20, 2026 / 05:08 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

WNP: మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.లక్ష CMRF చెక్కును దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 05:07 PM IST

ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

GNTR: మంగళగిరిలోని 6వ బెటాలియన్ APSPలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హోంమంత్రి అనిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా భద్రత కోసం శ్రమించే పోలీసులకు ఇలాంటి క్రీడలు అవసరమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో 6రాష్ట్రాల నుంచి మొత్తం 10 పోలీసు జట్లు పాల్గొంటున్నాయి.

February 20, 2026 / 05:06 PM IST

మైనార్టీ కార్పొరేషన్ నుంచి రూ.60 వేల సబ్సిడీ

NRML: తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తుర్క కాషా ముస్లిం సమాజానికి చెందిన రాయి కోత పనులు చేసే అర్హులకు రూ.60 వేలును 100% సబ్సిడీతో అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 1లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని, మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

February 20, 2026 / 05:05 PM IST