• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోడల్ మున్సిపాలిటీగా ఘనపూర్: ఎంపీ

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ మాడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మనమంతా కష్టపడి పనిచేద్దామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలతోనే రాజకీయాలు ముగిసాయని, రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందామన్నారు.

February 20, 2026 / 05:05 PM IST

‘నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలి’

ADB: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ భిక్కు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని PVTGలకు మంజూరైన ఇళ్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు కల్పిస్తుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసి లబ్ది పొందాలన్నారు.

February 20, 2026 / 05:05 PM IST

రేపు సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

CTR: పుంగనూరు బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలో సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం శనివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ, కుంబాభిషేకము, మహా పూర్ణాహుతి, అలంకరణ పూజా అధికారి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

February 20, 2026 / 05:04 PM IST

ఆకీరు వాగు నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా

MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం, గుర్తురు, మడిపల్లి, సోమారం కుంట తండా గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని మండలంలోని ప్రజలు, పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

February 20, 2026 / 05:04 PM IST

మాజీ మంత్రి బొత్స సవాల్‌కు లోకేష్ కౌంటర్

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఫొటో, వీడియో చూపించగలరా అంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో చెప్పులు, బూట్లు వేసుకుని సభ లోపల, బయట వైసీపీ సభ్యులు దేవుడి ఫొటో పట్టుకెళ్లిన వీడియోను లోకేష్ విడుదల చేశారు.

February 20, 2026 / 05:03 PM IST

మిషన్ భగీరథ హెల్పర్స్ అధ్యక్షునిగా విజయ సాగర్

NRML: జిల్లా మిషన్ భగీరథ డివిజన్ హెల్పర్స్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా విజయసాగర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం మండల కమిటీలను ప్రకటించారు. సోన్ మండలానికి వెలుమల శ్రీను, సారంగాపూర్ పిట్ల శీను, దిలావర్పూర్ రాజు, నర్సాపూర్ జి మండలానికి లావణ్యలు ఎంపికయ్యారు.

February 20, 2026 / 05:02 PM IST

‘ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్’

SRCL: ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల DSP నాగేంద్రచారి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 20, 2026 / 05:02 PM IST

ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ దేవానంద్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి డా.బత్తల హరిప్రసాద్ శుక్రవారం రూ.1,25,000 లక్షల విరాళం అందజేశారు. ఆయన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఆలయ విగ్రహాలు, లోపల గ్రానైట్ బండల ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు స్వయంగా అందజేశారు.

February 20, 2026 / 05:00 PM IST

రేపటి నుంచి DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాలు

TG: వికారాబాద్ అనంతగిరిలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ తరగతులను CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీ జిల్లా అధ్యక్షులకు ఏఐసీసీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఇవ్వనున్నారు. రేపటి నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది.

February 20, 2026 / 05:00 PM IST

LRS స్కీం‌పై టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం

ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్‌లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీములపై టౌన్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిబంధనలు పాటించి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 05:00 PM IST

మహేష్ బాబు అంటే ఇష్టం: టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్‌సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:00 PM IST

సీఎం సహాయని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో తాజాగా 36 మందికి రూ.16,24,276లు ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. మైలవరం, గొల్లపూడి గ్రామాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చెక్కులు రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధిని శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అన్నారు.

February 20, 2026 / 04:58 PM IST

కొర్రపాడులో పశు వైద్య శిబిరం నిర్వహణ

KDP: రాజుపాలెం(M) కొర్రపాడులో శుక్రవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇందిర ఆధ్వర్యంలో గైనకాలజీ, మెడిసిన్, ఆపరేషన్ ఇతర 40 కేసులకు సంబంధించి చికిత్సలు అందించారు. పశువుల వ్యాధి నివారణకు డీ-వార్మింగ్, డీ-టికింగ్ నిర్వహించారు. పశుపోషణ, వ్యాధులపై, చికిత్సలపై రైతులకు అవగాహన కల్పించారు.

February 20, 2026 / 04:56 PM IST

శ్రీవారితో ప్రభుత్వం పాలిటిక్స్ చేస్తుంది: బొత్స

AP: వేంకటేశ్వరస్వామితో కూటమి పార్టీలు పాలిటిక్స్ చేస్తున్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందన్న చంద్రబాబు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో ఎక్కడా తమ సభ్యులు చెప్పులు ధరించలేదని చెప్పారు.

February 20, 2026 / 04:56 PM IST

బండలాగుడు పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే

RR: కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. కేశంపేట మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 04:54 PM IST