»Navadeep Sensational Comments On Rumors About Him
Navdeep : తాను ‘గే’ కాదట.. ‘న్యూసెన్స్’ చేస్తున్న నవదీప్
తేజ దర్శకత్వంలో జై(Jai) సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చారు నవదీప్(Navdeep). మొదటి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. గౌతమ్ SSC(Gowthum SSC), చందమామ(Chandamama) లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీ(Industry)లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Navdeep : తేజ దర్శకత్వంలో జై(Jai) సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చారు నవదీప్(Navdeep). మొదటి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. గౌతమ్ SSC(Gowthum SSC), చందమామ(Chandamama) లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీ(Industry)లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తాను సోలోగా తీసిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. కొద్ది కాలంపాటు బుల్లి తెరపై హోస్ట్ గా చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మళ్లీ కొంత కాలం తర్వాత వెండితెరపై క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కెరీర్ సాగిస్తున్నారు. నవదీప్ చివరిసారిగా 2021లో విష్ణు మంచు హీరోగా చేసిన మోసగాళ్లు(Mosagallu) సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ఎక్కువగా తన ద్రుష్టి అంతా వెబ్ సిరీస్(Web series) ల మీద ఫోకస్ పెట్టారు.
తాజాగా నవదీప్ న్యూసెన్స్(Newsense) అనే వెబ్ సిరీస్(Web series)తో రాబోతున్నారు. ఇది ఆహా ఓటీటీ(Aha OTT)లో మే 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. నవదీప్, బిందుమాధవి(Bindu Madhavi) దీనిలో జంటగా నటించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన టీజర్(Teaser), సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఇలా ఉండగా నేడు న్యూసెన్స్ సిరీస్ ట్రైలర్ లాంచ్(Trailer Launch) ప్రెస్ మీట్(Pressmeet) జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నవదీప్, బిందు మాధవి, చిత్రయూనిట్, ఆహా టీం పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో నవదీప్ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సంచలన సమాధానాలు చెప్పారు.
కొన్నేళ్ల క్రితం నవదీప్ గే అని, నవదీప్ వల్ల ఓ హీరోయిన్(heroine) చనిపోయిందని వార్తలు షికారు చేశాయి. నేడు నవదీప్ వీటిపై క్లారిటీ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ.. 2005వ సంవత్సరంలో నావల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని ఓ పత్రిక(Paper)లో వార్త వచ్చింది. అది పూర్తిగా అబద్ధం. నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు. అలాగే నేను గే అనే వార్తలు కూడా వచ్చాయి. నేను గే అనేది అబద్ధం. నేను రేవ్ పార్టీలో పాల్గొన్నాను అని ఓ పేపర్ లో వార్త వచ్చింది. అది కూడా అబద్దం. ఆ వార్త జరిగింది అని చెప్పిన సమయంలో నేను మా అమ్మతో ఫార్మ్ హౌస్ కి వెళ్ళాను. అందుకు మా అమ్మే సాక్ష్యం. ఇలాంటి ఫేక్ వార్తల వల్ల మా ఇంట్లో కూడా నన్ను నమ్మే పొజిషన్ పోయింది. కానీ మా అమ్మతో ఉన్నప్పుడు అలా జరిగింది అని వార్త రాశారు. దాంతో మా ఇంట్లో నాపై నమ్మకం పెరిగింది. నేను మీడియాపై కక్ష సాధింపు చర్యకోసం మాత్రం ఇందులో నటించలేదు. ఈ సిరీస్ లో నేనే జర్నలిస్ట్ (Journalist)ని అని అన్నారు. దీంతో నవదీప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.