27 రకాల సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాయినగర్‌కు చెందిన నల్ల విజయ్ ఈ చీరను రూపొందించారు. గతంలో అగ్గిపెట్టె, ఉంగరం, దబ్బనం వంటి వస్తువుల్లో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. తాజాగా సువాసనలు వెదజల్లే చీరను నేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ సందర్భంగా మంత్రులు విజయ్‌ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా పేరు పెట్టారు. ఈ చీరను మగ్గంపై నేసినట్లు చేనేత కళాకారుడు విజయ్ పేర్కొన్నారు.