Mega Vs Allu Family : బయటపడ్డ మెగా vs అల్లు వార్.. చరణ్, బన్నీ మధ్య దూరం!?
Mega Vs Allu Family : ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఫ్యాన్స్ అయితే మాములుగా రచ్చ చేయడం లేదు. ఆరెంజ్ రీ రిలీజ్, ఆర్సీ 15 టైటిల్‌తో చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఫ్యాన్స్ అయితే మాములుగా రచ్చ చేయడం లేదు. ఆరెంజ్ రీ రిలీజ్, ఆర్సీ 15 టైటిల్‌తో చరణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండస్ట్రీలోని తన సన్నిహితులకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఈ పార్టీలో సుకుమార్, ప్రశాంత్ నీల్, నర్తన్, రాజమౌళి, కీరవాణి, వెంకటేష్, శర్వానంద్, రానా, అడవి శేష్, విజయ్ దేవరకొండ, నాగార్జున, అఖిల్ అక్కినేని, నాగ చైతన్యతో పాటు చాలామంది సెలబ్రిటిలు పాల్గొన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనపించలేదు. పార్టీకి రాకపోవడమే కాదు.. కనీసం బర్త్ డే విష్ కూడా చేయలేదు బన్నీ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా వార్ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. దానికి ఇప్పుడు బన్నీ విష్ చేయకపోవడం మరింత బలాలన్నిస్తోంది. చరణ్‌కు ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు విష్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం విష్ చెయ్యలేదు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వచ్చిన సమయంలోను బన్నీ లేట్‌గా రియాక్ట్ అయ్యాడు. అది కూడా ఎన్టీఆర్‌ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రత్యేకంగా చెప్పాడు. అప్పుడు కూడా చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా బర్త్ డే విష్ చేయలేదు. దీంతో మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయనే టాక్ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బర్త్ డే విష్ పోస్ట్ పెట్టకపోయినా.. చరణ్‌కు పర్సనల్‌గా ఫోన్ చేసి విష్ చేసి ఉంటాడనే టాక్ ఉంది. కానీ ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. మొత్తంగా మరోసారి అల్లు వారికి మెగా ఫ్యామిలీకి పడడం లేదనేది.. ఇప్పుడు చర్చకు దారి తీసింది.