krithi shetty : కృతి టైం బాగుంది.. వరుస ఫ్లాపుల్లోనూ రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసింది!
ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి(Kriti shetty). ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది. ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది. చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో కెరీర్ సతమతం అవుతున్న సంగతి తెలిసిందే.
krithi shetty : ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి(Krithi shetty). ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది. ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది. చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో కెరీర్ సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య(naga chaitanya)తో బంగార్రాజు చేసింది. ఆ సినిమా తర్వాత బేబమ్మకు మరో హిట్టు రాలేదు. ది వారియర్(the Warrior), మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్గా `కస్టడీ` మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తే.. వెంకట్ ప్రభు(Venkat prabhu) దర్శకత్వం వహించాడు.
తెలుగు తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అని అంత భావించారు. కానీ ఊహించని విధంగా వరుస ఫ్లాపుల్లోనూ ఆమె ఏకంగా రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ ను పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతుందంట. ఇటీవల `పొన్నియిన్ సెల్వన్ 2`తో జయం రవి(jayam ravi) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తన 32వ చిత్రాన్ని అతిపెద్ద తమిళ బ్యానర్ వేల్స్ ప్రొడక్షన్ లో చేయబోతున్నాడు. భువనేష్ అర్జునన్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.