జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తెలంగాణ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్(Indira Park) మహాధర్నాకు షర్మిల మద్దతు తెలిపారు. పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టు వైఎస్సార్ ఇచ్చిన భూములను కేసీఆర్ మాయం చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులకు (Journalists) భూమి ఇస్తే కమీషన్ రాదని.. కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే కమీషన్ వస్తుందనే కారణంతోనే కేసీఆర్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీని తమ పార్టీ మేనిఫేస్టోలో పెడతామని ఆమె వెల్లడించారు.వైఎస్సార్ (YSR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. 70 ఎకరాల భూమిని హౌసింగ్ సొసైటీ(Housing Society)కి ఇచ్చారని..అది కేసుల్లో ఉందన్నారు. సుప్రీం కోర్టు (Supreme Court) చెప్పినా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వలేదంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పూటకో మాట్లాడటం సీఎం కేసీఆర్ కు కొత్త కాదన్నారు షర్మిల. జర్నలిస్టులు వాస్తవాలు రాస్తే ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. స్వేచ్చగా వార్తలు రాసే పరిస్థితి జర్నలిస్టులకు లేదని అన్నారు.పాదయాత్ర లో నేను ఎమ్మెల్యే ల అవినీతి గురించి చెప్పిన ప్రతి నిజం నాకు జర్నలిస్టులు చెప్పినవేని షర్మిల తెలిపారు.మీ పోరాటాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె భరోసా కల్పించారు