Pan India heroes: ఒకే వేదిక పై పాన్ ఇండియా హీరోలు!?
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్‌కు నందమూరి హీరోలే కాదు.. పాన్ ఇండియా హీరోలు కూడా సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మే 20న ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ తెలిపారు. ఈ ఉత్సవాలను హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో సహా నందమూరి ఫ్యామిలీని టీడీపీ నేతలు ఆహ్వానించారు. జయకృష్ణ, మోహనకృష్ణ, కళ్యాణ చక్రవర్తి, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరిలను ఆహ్వానించారు. అలాగే ఈ వేడుకకు కన్నడ ప్టార్ శివ రాజ్‌కుమార్, నారా చంద్ర బాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. దాంతో ఈ వేడుక కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఎన్టీఆర్ జయంతి వేడుకకు పాన్ ఇండియా స్టార్స్ రాబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. లెజెండరీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల కోసం.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఒకవేళ పాన్ ఇండియా స్టార్స్ అంతా ఒకే స్టేజ్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోవడం కష్టమే. అందుకే ఈ వేడుకను రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బి స్టేడియంకు మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. మామూలుగానే మన స్టార్ హీరోలు ఒకరిద్దరు ఒకే వేదికను పంచుకుంటే.. అభిమానులు అరిచి గోల చేస్తారు. అలాంటిది ప్రభస్, బన్నీ, చరణ్, తారక్ ఒకే స్టేజ్ పై కనిపిస్తే.. చెప్పడానికి మాటలు ఉండవు. అయితే ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.