»Minister Thalasani Srinivas Yadavs Anger At The Woman 2
Jubilee Hills : మహిళపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
పనికి రానోళ్లంతా డబుల్ బెడ్రూం ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారు.. వారికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి.. అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ (Jubilee Hills) కమలానగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav), ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) గురువారం ఉదయం ప్రారంభించారు. 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్ చేసినమన్నరు. రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు కట్టి ఇస్తున్నామని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామన్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు (Indiramma’s house) కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. కానీ ఇప్పుడు ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు (Double bedroom house)నిర్మించడానికి రూ. 9 లక్షలు ఖర్చు అవుతోందని చెప్పారు మంత్రి తలసాని.
దేశంలో ప్రతి ఒక్కరూ నోటికచ్చిన వాగ్దానాలు చేస్తున్నరు.. కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవి పప్పు, బెల్లంలాగా ఎవరికి పడితే వారికి పంచడానికి ఉండదని తెలిపారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. ఇప్పుడు ఒక్కో డబల్ బెడ్ రూం ఇల్లు(Double bedroom house) నిర్మించడానికి 9 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని… కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.అయితే కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని (Minister Talasani) సీరియస్ అయ్యారు. తనకు ఇల్లు కావాలని సదరు మహిళ మంత్రి కోరింది. అయితే సమాధానం చెప్పాల్సిన మంత్రి… ఇల్లు కావాలని అడుగుతున్న మాహిళపై మండిపడ్డారు. దేశంలో ఎవరైనా ఇలాంటి ఇల్లు కట్టారా అంటూ తిరిగి ఆ మహిళనే మంత్రి ప్రశ్నించారు.