»Cm Revanth Reddys Key Statement On Tulam Bangaram In Kalyana Lakshmi And Shadi Mubarak Schemes
Revanth Reddy: తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారుల కోసం ప్రణాళిక రూపోందించాలని అధికారులను సూచించారు.
CM Revanth Reddy's Key Statement on Tulam Bangaram in Kalyana Lakshmi and Shadi Mubarak Schemes
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రచారంలో భాగంగా చేసిన హామీలను ఒక్కోక్కటిగా అమలు చేసే దిశగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shadi Mubarak ) లబ్ధిదారులకు తులం బంగారం(Tulam Bangaram) ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. శనివారం ఆయన సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు దాని కోసం అధికారులను అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల కెటాయించడానికి ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.