»If You Want To Keep Your Liver Helthy Then Avlid Eating These Food Items
Liver : కాలేయాన్ని కష్టపెడితే.. మీకు కాలం చెల్లినట్టే
మన కాలేయం(liver) శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాలేయం చెడిపోతే శరీరం మొత్తం కూడా పాడవుతుందని అంటారు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Liver : మన కాలేయం(liver) శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాలేయం చెడిపోతే శరీరం మొత్తం కూడా పాడవుతుందని అంటారు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు(Food Habbits) కాలేయం దెబ్బతినడానికి కారణం. కాలేయంపై చెడు ప్రభావం చూపే అలాంటి కొన్ని ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం.
తీపి పదార్థాలు
చక్కెర(Sugar) లేదా తీపి పదార్థాలు ఎక్కువగా తింటుంటే వెంటనే తగ్గించుకోవాలి. ఎందుకంటే వాటిని ఎక్కువగా తినడం వల్ల కాలేయం చక్కెరను కొవ్వు(Fat)గా మారుస్తుంది. ఈ కొవ్వు కాలేయంతో సహా శరీరంలోని భాగాలలో పేరుకుపోతుంది. దీని వల్ల మీరు ఫ్యాటీ లివర్(Fatty liver)తో బాధపడవచ్చు.
శీతల పానీయాలు
సోడా, శీతల పానీయాలు(Cool drinks) వంటి పానీయాలకు కూడా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది మరియు అనేక శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఈ పానీయాలలో సోడాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ఊబకాయం(obesity), శరీరంలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది.
ఉప్పు
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. ఉప్పు(Salt) వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది, ఇది శరీరానికి మంచిది కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఉప్పు బిస్కెట్లు, చిప్స్(Chips), స్నాక్స్ మొదలైన ప్యాకేజ్డ్ ఫుడ్స్(Packed Foods) తినకుండా ఉండాలి. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటుంది. ఆ కొవ్వు ఊబకాయానికి దారితీస్తుంది.
రెడ్ మీట్
రెడ్ మీట్ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. రెడ్ మీట్‌ను జీర్ణం చేయడం కాలేయానికి చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే రెడ్ మీట్(Red Meat)లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి మరియు ఇంత పెద్ద మొత్తంలో ప్రోటీన్(Protin)ను విచ్ఛిన్నం చేయడం కాలేయానికి చాలా కష్టమైన పని. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఆల్కాహాల్
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. అధికంగా తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) వస్తుంది. అధికంగా తాగడం వల్ల కాలేయం సిర్రోసిస్‌కు కూడా దారితీయవచ్చు. లివర్ సిర్రోసిస్ కూడా కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
ఫాస్ట్ ఫుడ్
పిజ్జా, బ్రెడ్, పాస్తా వంటి పిండితో చేసిన ఆహారాలు మీ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా, కొవ్వు పదార్ధాలు కూడా మీ కాలేయానికి సమస్యగా మారవచ్చు.