UP board Results: ఫలితాలు విడుదల.. వెబ్సైట్ క్రాష్
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ (UPMSP) ఈరోజు 10, 12వ తరగతి ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. అసలు ఏమైందో ఇప్పుడు చుద్దాం.
10, 12వ తరగతికి సంబంధించి ఉత్తరప్రదేశ్ బోర్డు తాజాగా ఫలితాలు ప్రకటించింది. ఈ క్రమంలో 12వ తరగతిలో ఉత్తీర్ణత శాతం 75.2%గా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి UP బోర్డ్ క్లాస్ 10, UP బోర్డ్ క్లాస్ 12 ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించారు. దీంతో అనేక మంది విద్యార్థులు ఒక్కసారిగా వెబ్ సైట్ ఓపెన్ చేయడంతో క్రాష్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. X, XIIవ తరగతి ఫలితాలను మీ DigiLocker ఖాతాలలో యాక్సెస్ చేస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 3 వరకు జరగగా, 12వ తరగతికి సంబంధించిన యూపీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 4 మధ్య జరిగాయి. ఈ ఏడాది యూపీ బోర్డు 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు 58.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు ఇతర ప్రాథమిక సమాచారంతో పాటు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.