ఎవరెంత మద్యం తాగుతారో అని పోటీలు పెట్టుకుని మరీ తాగుతున్నారు. కానీ అలాంటి పోటీ పెట్టుకుని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక బ్రిటీష్ వ్యక్తి 21 కాక్టెయిల్స్ తాగాలని పందెం వేసి, 12 కాక్టెయిల్స్ తాగి చనిపోయాడు.
Alcohol Death: నేటి కాలంలో మద్యం పేరు వినగానే జనాలు రెచ్చిపోతున్నారు. ఎవరెంత మద్యం తాగుతారో అని పోటీలు పెట్టుకుని మరీ తాగుతున్నారు. కానీ అలాంటి పోటీ పెట్టుకుని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక బ్రిటీష్ వ్యక్తి 21 కాక్టెయిల్స్ తాగాలని పందెం వేసి, 12 కాక్టెయిల్స్ తాగి చనిపోయాడు. సరదా కాస్త శోకంగా మారిన ఈ ఘటన బ్రిటిష్ రెసిడెంట్ తిమోతీ అలెన్ సదరన్ కుటుంబ సభ్యులకు సంబంధించినది. కుటుంబంతో కలిసి తిమోతీ జమైకాలో ఉన్నాడు. ఉత్సాహంలో కాక్టెయిల్ తర్వాత కాక్టెయిల్ తాగడం ప్రారంభించాడు. కానీ అతను ఇలా సీసాలు తాగి దాని పవర్ తట్టుకోలేకపోయాడు. దీంతో 53 ఏళ్ల తిమోతీ 12 కాక్టెయిల్స్ తాగి కుప్పకూలి చనిపోయాడు.
తిమోతీ తన కుటుంబంతో కలిసి జమైకాలోని సెయింట్ ఆన్ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం నుంచి తిమోతీ బీరు, బ్రాందీ తాగుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ రోజు తిమోతి ఇద్దరు కెనడియన్ మహిళలతో కలిసి.. ఆ ఇద్దరు మహిళల తమ పుట్టినరోజును జరుపుకోవడానికి జమైకాకు వెళ్లినట్లు తిమోతికి చెప్పారు. ఈ సమయంలో వారు కాక్టెయిల్స్ తాగడానికి పోటీ పడ్డారు. అర్ధరాత్రి వరకు 21 కాక్టెయిల్స్ తాగిన వాడే విజేత అవుతాడనేది పోటీ షరతు. తిమోతీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొనగా, తిమోతీ అక్కడికి ఓ బార్లోకి వెళ్లి 12 రకాల కాక్టెయిల్స్ తాగాడు. దీని తర్వాత అతను హోటల్ గదికి తిరిగి వచ్చాడు.
తిమోతీ హోటల్‌కి తిరిగి వెళ్లేసరికి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. తిమోతి విపరీతంగా వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కలత చెందారు. వెంటనే అంబులెన్స్‌ని పిలిపించాలని హోటల్ సిబ్బందిని కోరారు. కానీ వారు సరైన శిక్షణ లేని ఓ నర్సును పంపారు. అప్పటికే తిమోతి ఆరోగ్యం విషమించి చనిపోయాడు. తిమోతీ మృతికి జమైకా హోటల్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హోటల్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందన్నారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా హోటల్ యజమానుల సహకారం లేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తరలించి ఉంటే, తిమోతీ బతికి ఉండేవాడని మృతుడి బంధువులు కూడా పేర్కొంటున్నారు. తిమోతి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. తిమోతి మృతి చెందింది మరే ఇతర కారణాల వల్ల కాదని, అతిగా మద్యం సేవించడం వల్లేనని తెలిపారు.