YCP Mla Anil Kumar Followers Are Attack Security Guards
YCP Mla Anil Kumar: నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar) అనుచరులు రెచ్చిపోయారు. ఇక్కడ పార్కింగ్ వద్దని చెబితే రెచ్చిపోయారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై పిడిగుద్దులు గుప్పించారు. ఘటనను అపార్ట్ మెంట్ వాసులు మొబైల్లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ అవుతుంది.
గచ్చిబౌలి అపర్ణ సెరెన్ అపార్ట్ మెంట్ వద్ద గొడవ జరిగింది. అక్కడికి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar) అనుచరులు వచ్చారు. కారు పార్కింగ్ ఇక్కడ చేయొద్దని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పారు. దీంతో అనిల్ అనుచరులకు కోపం వచ్చింది. తమ కారుకే పార్కింగ్ లేదంటవా అని కోపంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా దాడికి దిగారు. ఇద్దరు ముగ్గురు గార్డులపై 10, 15 మంది కలిసి దాడి చేశారు.
గొడవ జరుగుతున్న విషయం తెలుసుకుని అపార్ట్ మెంట్ వాసులు వీడియో తీశారు. అందులో స్పష్టంగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనిల్ (Anil Kumar) అనుచరుల హంగామా అంటూ రాసుకొచ్చారు. ఘటనపై అనిల్ స్పందించాల్సి ఉంది. వీడియోకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి. నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎంత అనుచరులు అయితే మాత్రం ఇలా దాడి చేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు.