TG: కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ‘బండి సంజయ్కు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం దొంగల సభలాగా కనిపించడం దురదృష్టకరం. ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనట్లు అనిపిస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గిస్తే ఊరుకోము’ అని తేల్చి చెప్పారు.