AP: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఐదేళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా ‘మ్యాన్‌పవర్ ఆడిట్’ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. 30 రోజుల్లో నివేదిక తెప్పించుకుని అనర్హులపై వేటు వేస్తామని స్పష్టం చేశారు. అలాగే, ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. మరో 45 రోజుల్లో ఆ నివేదిక ప్రభుత్వానికి అందుతుందని వెల్లడించారు.