AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో ఐదు రోజులపాటు నిందితులను విచారించారు. సిట్ అధికారులు కస్టడీలో వివిధ అంశాలపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావ్డానును సిట్ అధికారులు ప్రశ్నించారు.