AP: రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సత్యసాయి, తిరుపతి జిల్లాలో దేశంలో తొలిసారి ట్విన్ స్పేస్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్పేస్ సిటీలో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్పేస్ పాలసీలో భాగంగా స్పేస్ టెక్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయించామని వెల్లడించారు.