భారత్, రష్యాల మధ్య భాగస్వామ్యానికి అపారమైన సామర్థ్యం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మాస్కోలో 21వ ఇండియా-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మిలిటరీ అండ్ కో ఆపరేషన్ సెషన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహం పర్వతం కంటే ఎత్తైనదని, సముద్రం కంటే లోతైనదని కేంద్రమంత్రి అభివర్ణించారు. భారత్ తన మిత్రదేశాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.