TG: సోషల్ మీడియాలో BRS దుష్ప్రచారం చేస్తోందని MP మల్లురవి ఆరోపించారు. ‘బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతోనే.. కేంద్ర ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ వచ్చింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ఎంపవర్డ్ కమిటీ గ్రహించింది. కంచ గచ్చిబౌలి భూములపై BRS న్యాయపోరాటం చేయలేదు. కేసు పదేళ్లు పెండింగ్లో ఉండటానికి కేసీఆరే కారణం. కాంగ్రెస్ కృషితోనే 400 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చాయి’ అని పేర్కొన్నారు.