AP: తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి బృందం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మంత్రులను పట్టువస్త్రాలతో సన్మానించారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకన్న వారిలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత ఉన్నారు.