TG: రాష్ట్ర అసెంబ్లీ ముందుకు కొత్త ROR చట్టం రానుంది. సభలో ROR-2024 బిల్లును మంత్రి పొంగులేటి ప్రవేశపెట్టనున్నారు. ధరణి పోర్టల్‌ను భూమాతగా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న ROR-2020 చట్టం రద్దు కానుంది. నూతన చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్స్, ప్రతి భూ కమతానికి భూధార్ నెంబర్, గ్రామ కంఠం స్థలాలకు సర్కార్ హక్కులు కల్పించనుంది.