AP: రాష్ట్రంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. సరఫరా చైన్లో తలెత్తిన స్వల్ప అంతరాయం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, గతేడాదితో పోలిస్తే డీజిల్ వినియోగం ఒక్కసారిగా 35-40 శాతం పెరిగిందన్నారు. చమురు డిపోల నుంచి సరఫరా ముమ్మరంగా సాగుతోందని, సాయంత్రానికి రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.