చలికాలంలో వ్యాయామం చేయడం మానొద్దు. యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగాలి. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధులు, పిల్లలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో వేడిని ఎక్కువగా కోల్పోకుండా కాపాడుకోవాలి.