నారింజ పండు తిని తొక్కలని పడేస్తుంటారు. కానీ ఆ తొక్కలతో చాలా లాభాలున్నాయి. ఆరెంజ్ తొక్కల పొడిలో తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలు, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసి మరిగించిన నీరు.. రూమ్ స్ప్రేగా ఉపయోగపడుతుంది. వెనిగర్లో రెండు వారాల పాటు ఈ తొక్కల్ని నానబెట్టి తర్వాత వడకట్టిన నీటితో కిచెన్ గట్టు, స్టవ్ క్లీన్ చేస్తే మరకలు క్షణాల్లో తొలగిపోతాయి.