TG: పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYDలోని హయత్నగర్ పరిధిలో జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ రాత్రి పాఠశాల హాస్టల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.