CTR: చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.