BPT: బాలిక సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి సంరక్షణకు కృషి చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి పేర్కొన్నారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం బాలికల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ సుశీల అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని బాలికా సంరక్షణపై పలు సూచనలు అందజేశారు.