ASR: అనంతగిరి మండలంలోని ఎన్ఆర్.పురం పంచాయతీ పరిధి నాయుడువలస గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక సమీపంలోని కొండ ఊటల ద్వారా కొంచెం కొంచెం నీటితో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని గిరిజనులు సోమవారం తెలిపారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.