GNTR: రాష్ట్రాన్ని క్రీడల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో శనివారం సాయంత్రం కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక ధారుఢ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.