PDPL: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందించే వైద్య సేవలు గణనీయంగా పెరిగాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. డిసెంబర్లో జిల్లా ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో 838 మంది ఇన్ పేషెంట్, 7695 ఔట్ పేషెంట్ల వైద్య సేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. 113 మందికి కంటి, 55 ఆర్థోపెడిక్, 33 జనరల్ శస్త్ర చికిత్స, 192 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు.