విశాఖ పోర్టులో ఈనెల 14న ఫైట్ స్టేషన్ గిడ్డంగుల్లో సీజ్ చేసిన 259 మెట్రిక్ టన్నుల బియ్యంలో రేషన్ బియ్యం కలవలేదని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ శనివారం తెలిపారు. సీజ్ చేసిన బియ్యంలో శాంపిల్స్ తీసుకుని ప్రయోగశాలకు పంపించామన్నారు. వాటిలో రేషన్ బియ్యం కలవలేదని నివేదిక వచ్చిందన్నారు.