VSP: ఏయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి వెబ్సైట్లో పరీక్షల టైమ్ టేబుల్ అందుబాటులో ఉంటుందన్నారు. వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.