విశాఖలో ఈనెల8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులను నియమించారు. వీరు కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 10మంది డిప్యూటీ కలెక్టర్లు, 20మంది MROలు, రవాణా పౌర సరఫరాలు రోడ్లు భవనాల శాఖ నుంచి పలువురు అధికారులను నియమించారు. 60వేల మందితో రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు.