PLD: బొల్లాపల్లి మండలంలో సోమవారం ఉదయం ప్రజాదర్బార్ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరగనున్న ఈ కార్యక్రమంలో, మండల ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు.