వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఈరోజే పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ మేరకు లోక్ సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల జాబితాలో కేంద్రం జమిలి ఎన్నిల బిల్లును చేర్చింది. ఈ రోజు మధ్యాహ్నం న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జమిలిపై అనేక అనుమానాలు నెలకొనడంతో దీన్ని జేపీసీకి పంపేందుకు స్పీకర్‌ను కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ఎంపీలందరూ పార్లమెంట్‌కు హాజరు కావాలని ఆదేశించింది.