తన పార్టీ నాయకులపై బీజేపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నా ఆరోపణల నేపథ్యంలో మాజీ కేబినెట్ మంత్రితో సహా 13 మందిపై వేటు వేసింది. ఆయా నాయకులను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది. వేటు పడి వారిలో పంజాబ్ మాజీ మంత్రి భగత్ చున్నీలాల్ కూడా ఉండటం గమనార్హం. వీరిపై వేటు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించింది.