బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం పదే పదే ఆటంకం కలిగిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ కీలక బౌలర్ హేజిల్‌వుడ్ కాలిపిక్కలు పట్టేయడంతో ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అనంతరం స్కానింగ్ కోసం అతడిని తీసుకువెళ్లినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గాయం తీవ్రంగా ఉందని తేలితే ఈ మ్యాచ్‌కు హేజిల్‌వుడ్ దూరమయ్యే అవకాశం ఉంది.