VZM: గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక చంపావతి నదిలో కొండ చిలువ సోమవారం సాయంత్రం జాలర్ల వలలో చిక్కుకుంది. భారీ పైథాన్ చంపావతి నది పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండటంతో సరాబుల కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. తరచూ చంపావతి పరివాహక ప్రాంతంలో కొండ చిలువలు వస్తున్నాయని కాలనీ వాసులు తెలిపారు. కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచినట్లు తెలిపారు.