ఇటీవల హీరో నాగచైతన్య నటి శోభితల వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైతన్య పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన నటీనటులను కలుస్తామని అన్నారు. అందులో తెలుగు భాషలో మాట్లాడేవారితో తాను త్వరగా కనెక్ట్ అవుతానని చెప్పారు. శోభితను కూడా తనతో తెలుగులో మాట్లాడాలని అడిగినట్లు వెల్లడించారు.