AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన దృష్ట్యా మంగళగిర పరిసరాల్లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. చెన్నై-విశాఖ జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు దేవరపల్లి వైపు, చెన్నై నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.