LIC వద్ద గత ఆర్థిక సంవత్సరంలో మెచ్యూర్టీ అయిన అన్క్లెయిమ్డ్ బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మెచ్యూర్టీ బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేయని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నారని వెల్లడించింది. 2022-23 మధ్య కాలంలో 3,73,329 మంది ఉండగా.. వీరికి సంబంధించి రూ.815 కోట్లు నిధులు ఉన్నాయని పేర్కొంది. 2023-24లో రూ.14 లక్షల విలువైన మరణానికి సంబంధించిన అన్క్లెయిమ్డ్ నిధులు ఉన్నాయని చెప్పింది.