chia seeds water : ఉదయాన్నే చియా సీడ్స్ వాటర్‌తో శరీరానికి మేలు
ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించాలనుకునే వారికి చియా గింజల నీరు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ పొద్దున్నే ఈ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. అవేంటంటే...
chia seeds water in the morning : ఈ మధ్య కాలంలో చాలా మంది ఉదయం పూట పరగడుపున ఆరోగ్యానికి మేలు చేకూర్చే పదార్థాలను తినడం, తాగడం చేస్తున్నారు. తేనె, తిమ్మరసం, గ్రీన్ టీ తాగడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఉదయాన్నే ఓ గ్లాసుడు చల్లని నీటిలో రెండు స్పూన్ల చియా సీడ్స్ వేసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నారు. చియా సీడ్స్ నీటిని(chia seeds water) ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుని తర్వాత దాని ప్రయోజనాలేంటో చదివేయండి.
ఓ గ్లాసుడు చల్లని నీటిలో రెండు స్పూన్ల చియా సీడ్స్‌ని వేయాలి. ఓ పది నిమిషాల పాటు వాటిని అలా వదిలేయాలి. అప్పుడు అవి వాటి అసలు పరిమాణం కంటే దాదాపు 12 రెట్లు పెద్దవిగా ఉబ్బుతాయి. ఈ నీటిని ఉదయం పూట తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో సులువుగా శరీరానికి లభిస్తాయి.
ఈ నీటిని ఉదయం పూట తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇరిటేడెడ్ స్కిన్ సమస్య తగ్గుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో ఇది ఫైట్ చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అరికడుతుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది శరీర అంతర్గత అవయవాల్లో వచ్చే వాపుల్ని నివారిస్తాయి. వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్(antioxidant) ఉంటుంది. అది అధిక రక్త పోటును తగ్గించడంలో సహాయ పడుతుంది. వీటిలో పుష్కలంగా పీచు పదార్థాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. దీనిలో ఉంటే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. దీనిలో అధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఎక్కువగా తినడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సహకరిస్తుంది.