AP: ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను మంగళవారం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్లలో ఒక్కో దానికి 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్టర్లను నియమించింది. కాగా.. ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం కల్పించారు.