బీహార్ ఎన్నికల్లో మహా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘెపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సతీష్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ మూడో స్థానంలో సరిపెట్టుకున్నారు. అక్కడ రామ్ విలాస్ అభ్యర్థి గెలిచారు.