TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఈరోజు మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో సమావేశం కానున్నారు. కాగా, గెలిచే సత్తా ఉన్నవారిపై అధ్యయనం చేసి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.