మొబైల్ టారిఫ్లకు సంబంధించి ప్రభుత్వ రంగ నెట్ వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్ కీలక ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్లు పెంచే ప్రణాళిక లేదని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల టారిఫ్లను పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ విధంగా స్పందించింది. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమన్నారు.