»Bournvita Responds After Influencers Video On High Sugar
Bournvitaలో షుగర్, క్యాన్సర్ కారక రంగులు.. కంపెనీ క్లారిటీ
బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.
Bournvita Responds After Influencer's Video On "High Sugar"
Bournvita:క్యాడ్బరీ బోర్న్‌విటా (Bournvita) హెల్త్ డ్రింక్‌కు సంబంధించి రూమర్స్ వచ్చాయి. ఇందులో హై షుగర్ (sugar), క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని రేవంత్ (revanth) అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చర్చకు వచ్చింది. వెంటనే కంపెనీ స్పందించింది. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. వీడియో (video) పోస్ట్ చేసిన రేవంత్‌కు (revanth) లీగల్ నోటీసు ఇచ్చింది. అంతకుముందే వీడియో సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొట్టింది.
‘గత 7 దశాబ్దాలుగా (7 decades) భారత ప్రజల నమ్మకం చూరగొన్నాం. భారత చట్టాలను గౌరవిస్తూ.. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డ్రింక్ రూపొందిస్తున్నాం. పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. తాము ఏ పదార్థాలు వాడుతున్నామో ప్యాక్ మీద ముద్రించాం. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్దతో రుచిని ఇచ్చేందుకు కృషి చేశాం. రెగ్యులెటరీ ఆమోదించిన పదార్థాలనే డ్రింక్‌లో వాడాం అని’ బోర్న్ విటా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
వీడియో (video) బయటకు రావడంతో భయాందోళన కలిగి ఉంటుంది.. అయినప్పటికీ తమ వినియోగదారులు కంపెనీపై నమ్మకం కలిగి ఉన్నారని పేర్కొంది. ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లొద్దనే ఉద్దేశంతో ప్రకటన జారీచేశామని తెలిపింది. బోర్న్‌విటా (Bournvita) ప్రకటన విడుదల చేసినప్పటికీ.. డిలేట్ చేసిన వీడియో ఇప్పటికే ట్రోల్ అయ్యింది. 12 మిలియన్ వ్యూస్ (12 million views) వచ్చాయి. అన్నీ సోషల్ మీడియా ప్లాట్ పామ్స్లలో వీడియోను షేర్ చేశారు. నటుడు, రాజకీయ నేత పరేష్ రావల్, మాజీ క్రికెటర్, ఎంపీ, కీర్తి ఆజాద్ కూడా షేర్ చేశారు.
రేవంత్ అనే వ్యక్తి న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ అనే చెప్పుకుంటున్నాడు. బోర్న్ విటాలో షుగర్, కొకొ సాటిల్స్ ఉన్నాయని, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని పేర్కొన్నారు. వీడియో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.