AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నూక మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు. అతడిపై గతంలో విశాఖలో కేసు నమోదైనట్లు గుర్తించారు.